IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించాడు. పవర్‌ప్లేలోనే టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో (102 పరుగులు) ఆదుకున్నాడు. అతనికి అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) చక్కని సహకారం అందించాడు. ఆఖర్లో భారత బౌలర్లు మళ్లీ పుంజుకోవడంతో అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.
జైస్వాల్ వీరవిహారం.. రోహిత్ మెరుపులు
219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రేంజ్ స్టార్టింగ్ ఇచ్చారు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అవుట్ కాగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీతో చెలరేగాడు. కేవలం 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ (20) తో కలిసి జైస్వాల్ మరో వికెట్ పడకుండా 28.4 ఓవర్లలోనే భారత్‌కు (224/1) ఘన విజయాన్ని అందించాడు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!