నేడు రెండో వన్డే.. గెలుపు కోసం టీమిండియా ఆరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. పార్ల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. రెండో వన్డేలో అయినా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలు కాక తప్పలేదు.
Read Also: టీమిండియాకు మరో షాక్.. ఒక్కరికి కూడా దక్కని చోటు
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
ముఖ్యంగా జట్టు ఎంపిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సవాల్‌గా మారింది. ఆల్‌రౌండర్ కేటగిరిలో తీసుకున్న వెంకటేష్ అయ్యర్ చేత తొలి వన్డేలో బౌలింగ్ వేయించకపోవడంపై విమర్శల వర్షం కురిసింది. అతడితో బౌలింగ్ వేసే ఉద్దేశం లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తీసుకుంటే సరిపోయేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిఖారైన ఆల్‌రౌండర్లు పాండ్యా, రవీంద్ర జడేజా లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లలో ఒకరు రాణించడం, కోహ్లీ బాగా ఆడటంతో పాటు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
మరోవైపు పార్ల్ వేదికలో వేడి ఎక్కువ ఉండటంతో పిచ్ పొడిగా మారే అవకాశం ఉంది. దీంతో పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా బ్యాటింగ్ కష్టతరంగా మారే ఛాన్స్ ఉంది. తొలి వన్డేలో ఇదే జరగడంతో భారత్ ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ