ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఫైనల్లోకి భారత యువ జట్టు అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరింది. తొలుత బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ 90 పరుగులు చేశాడు. విక్కీ (28), కెప్టెన్ యష్ (26), రాజ్ బవా (23) పరుగులు చేశారు.
Read Also: 2021ని విజయంతో ప్రారంభించి.. విజయంతోనే ముగించిన టీమిండియా
244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు హడలెత్తించారు. దీంతో 38.2 ఓవర్లలోనే బంగ్లా జట్టు 140 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్, రవికుమార్, రాజ్ బవా, విక్కీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా మరో సెమీస్‌లో పాకిస్థాన్‌పై 22 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచి ఫైనల్‌కు వెళ్లింది. దుబాయ్ వేదికగా శుక్రవారం నాడు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.