IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
- మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లండ్ రెండో టీ20
- టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు
- ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు, వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ అవకాశం దక్కని 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి.. మాంచెస్టర్ మ్యాచ్‌లో భారత తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. దాంతో తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో సమతుల్యత తీసుకురావడానికి మేనేజ్మెంట్ మిడిల్ ఆర్డర్లో ఒక కీలక మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల వరుసగా విఫలమవుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడట.
Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
టీ20 ప్రపంచకప్ 2026లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు అద్భుతంగా రాణించడంతో.. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇదే విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉన్నప్పటికీ.. బౌలింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగనున్నాడు. పేస్ కోటాలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఆడుతారు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌ల స్పిన్ త్రయంపై జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచనుంది.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!