India vs Playing XI Pakistan in T20 World Cup 2026: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో సూర్య సేన విజయం సాధించింది. చిన్న జట్లు అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు అందుకుంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 15)న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపనుంది. ఎన్ని గెలిచినా పాకిస్థాన్‌పై గెలిస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే టీమిండియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
పాకిస్థాన్ మ్యాచ్‌కు జట్టు కాంబినేషన్‌లో మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అభిషేక్ రాకతో వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకొవాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్‌లో కూడా మార్పు చోటుచేసుకునేలా కనిపిస్తోంది. పవర్ హిట్టర్ రింకు సింగ్‌ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. బౌలింగ్ బ్యాలెన్స్ పెంచేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇషాన్ కిషన్ మంచి ఫామ్ మీదున్నాడు. అభిషేక్ శర్మ కూడా బ్యాట్ జుళిపిస్తే అదిరే ఆరంభం దక్కుతుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఇప్పటికే హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. శివమ్ దూబే భారీ హిట్టింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్ ప్రదర్శన జట్టుకు ఉపయోగపడనుంది. స్పిన్ దళానికి వరుణ్ చక్రవర్తి నాయకత్వం వహించనున్నాడు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు. హార్దిక్ మూడో పేసర్ గా ఉంటాడు. మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా ప్లేయింగ్ XIను సెట్ చేస్తోంది.
తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
