Site icon NTV Telugu

T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..

Pakistan

Pakistan

T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ స్టార్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్మాన్ గట్టి హెచ్చరికలు పంపాడు. భారత్‌పై గత మ్యాచుల్లో చేసినట్లే అటాకింగ్, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆడుతామని అన్నారు. ఆసియా కప్‌లో ఎలాగైతే అగ్రెసివ్‌గా ఆడామో, ఇప్పుడు కూడా అదే విధంగా ఆడుతామని చెప్పారు. ఈ వరల్డ్ కప్‌లో 2-3 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Read Also: Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

మరోవైపు, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. తమ జట్టు ఛేజింగ్‌ను ఇష్టపడినప్పటికీ, మంచి లక్ష్యాన్ని నిర్దేవించడం కూడా అంతే సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ముందుగా బ్యాటింగ్ చేసి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును డిఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. పవర్ ప్లే బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించారు.

Exit mobile version