NTV Telugu Site icon

Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!

Virat

Virat

Virat Kohli: వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. అతని షాట్లతో ప్రత్యర్థులను వణికించేలా చేస్తాడు. అయితే ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ లో షాట్లపై ఇండియా మరియు పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి

ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే అంతకుముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా నెట్ ప్రాక్టీస్‌లో ఇలాంటి రివర్స్ స్వీప్ ఆడాడు. సో.. అక్కడ మొదలైంది.

Delhi Road: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. తప్పిన ప్రమాదం

విరాట్ కోహ్లి, బాబర్ అజామ్ రివర్స్ స్వీప్ వీడియోను పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ పోస్ట్ చేశాడు. బార్బడోస్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్ కరాచీలో బాబర్ ఆజం కూడా ఆడాడని ఫరీద్ ఖాన్ రాశాడు. ఇది చూసిన పాక్ అభిమానులు విరాట్ కోహ్లి బాబర్ అజామ్‌ను కాపీ కొట్టాడని ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియా ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఇలాంటి షాట్లు ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.