RSWS 2022: చితక్కొట్టిన నమన్.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Legends Enters In Finals After Defeating Australia Legends: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ నమన్ ఓజా (90 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో.. ప్రత్యర్థి జట్టు కుదిర్చిన లక్ష్యాన్ని ఇండియా లెజెండ్స్ చేధించగలిగింది. ఒక దశలో కీలకమైన వికెట్లు పడిపోవడంతో.. ఇండియా లెజెండ్స్ ఓడిపోతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ.. ఓజాతో కలిసి ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ మెరుపులు మెరిపించడంతో విజయం సాధించగలిగింది. దీంతో.. ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
నిజానికి.. బుధవారమే ఈ మ్యాచ్ పూర్తి అవ్వాల్సింది. కానీ, ఆస్ట్రేలియా లెజెండ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఆగిన తర్వాత ఆట తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వర్షం ఎంతసేపటికీ ఆగలేదు. దీంతో, చేసేదేమీ లేక గురువారం ఆటని కొనసాగించారు. వర్షం కారణంగా ఆటని ముగించిన సమయంలో.. ఆస్ట్రేలియా లెజెండ్స్ 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. గురువారం మరో 3 ఆడగా.. మొత్తం 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు. చివర్లో చివర్లో కామెరున్ వైట్ (30), బ్రాడ్ హడిన్ (12) రాణించారు.
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. సచిన్ టెండూల్కర్ (10), సురేశ్ రైనా(11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ (18)తో కలిసి నమన్ ఓజా (62 బంతుల్లో 90 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇంతలో యువీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే బిన్నీ సహా యూసఫ్ పఠాన్ వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. అప్పుడు వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ (12 బంతుల్లో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో.. 19.2 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ లక్ష్యాన్ని చేధించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..