Site icon NTV Telugu

Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

Team India Ind Vs Wi

Team India Ind Vs Wi

India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఘనతతో ప్రపంచ క్రికెట్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. ఎన్నో సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన, బలమైన జట్టు సమతౌల్యం, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఈ రెండు టీమ్స్ 18 సార్లు సెమీస్‌కు చేరాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు 16 సార్లు సెమీఫైనల్‌ దశకు చేరాయి. దక్షిణాఫ్రికా 15 సార్లు సెమీస్‌కు చేరి ఈ కాబితాలో చోటు దక్కించుకుంది . శ్రీలంక, వెస్టిండీస్ జట్లు 11 సార్లు సెమీఫైనల్స్‌ చేరగా.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఒక్కసారి సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. పెద్ద టోర్నీల్లో అనుభవం, జట్టు స్థిరత్వం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది.

Also Read: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరడం అంటే పెద్ద సవాలే. భారత్ ఈ రికార్డు సాధించడం వెనుక ఆటగాళ్ల ప్రతిభ, విభిన్న ఫార్మాట్లలో సమర్థ ఆట, యువత-సీనియర్ల సమన్వయం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా సెమీస్ చేరడం అంటే అది ఒక జట్టు స్థాయి, సామర్థ్యానికి ప్రతీక. ఈ రికార్డుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించగలదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Exit mobile version