Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
- ఐసీసీ టోర్నీల్లో భారత్ స్థిరమైన ప్రదర్శన
- ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర
- 20 సార్లు సెమీఫైనల్స్‌కు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఘనతతో ప్రపంచ క్రికెట్లో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. ఎన్నో సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన, బలమైన జట్టు సమతౌల్యం, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఈ రెండు టీమ్స్ 18 సార్లు సెమీస్‌కు చేరాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు 16 సార్లు సెమీఫైనల్ దశకు చేరాయి. దక్షిణాఫ్రికా 15 సార్లు సెమీస్‌కు చేరి ఈ కాబితాలో చోటు దక్కించుకుంది . శ్రీలంక, వెస్టిండీస్ జట్లు 11 సార్లు సెమీఫైనల్స్ చేరగా.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఒక్కసారి సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. పెద్ద టోర్నీల్లో అనుభవం, జట్టు స్థిరత్వం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
Also Read: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరడం అంటే పెద్ద సవాలే. భారత్ ఈ రికార్డు సాధించడం వెనుక ఆటగాళ్ల ప్రతిభ, విభిన్న ఫార్మాట్లలో సమర్థ ఆట, యువత-సీనియర్ల సమన్వయం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా సెమీస్ చేరడం అంటే అది ఒక జట్టు స్థాయి, సామర్థ్యానికి ప్రతీక. ఈ రికార్డుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించగలదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!