IND vs ZIM Super 8: సమయం ఆసన్నమైంది సంజూ.. ఇక టీమిండియాకు నువ్వే దిక్కు!
- టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పై మరోసారి చర్చలు
- లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ప్రత్యర్థి జట్లు స్పిన్‌తో దాడి
- అభిషేక్ శర్మ మూడుసార్లు, ఇషాన్ కిషన్ ఒకసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Likely To Play IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పై చర్చలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ప్రత్యర్థి జట్లు స్పిన్‌తో దాడి చేయడం విజయవంతంగా మారుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్ తొలి ఓవర్‌లోనే స్పిన్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మొదటి ఓవర్‌లో స్పిన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ మూడుసార్లు, ఇషాన్ కిషన్ ఒకసారి డక్ అవుట్ కావడం విశేషం.
సూపర్-8లో టీమిండియాపై జింబాబ్వే కూడా మొదటి ఓవర్‌లో స్పిన్ వ్యూహాన్ని కొనసాగించే అవకాశముంది. కెప్టెన్ సికందర్ రాజా లేదా యువ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్ కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. భారత్ మరోసారి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతో కొనసాగితే.. జింబాబ్వే ప్లాన్ అమలయ్యే అవకాశముంది. అందుకే స్ట్రైక్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను పంపితే.. స్పిన్ వ్యూహాన్ని తిప్పికొట్టొచ్చు. స్పిన్ బౌలింగ్‌లో మంచి రికార్డులు ఉన్న సంజూ.. ఆరంభంలోనే గేమ్‌ను నియంత్రించే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్‌ను సంజూ బాగా ఎదురుకొంటాడు. అలానే ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా భారీ షాట్స్ ఆడే సామర్థ్యం సంజూ సొంతం.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
టీ20 ప్రపంచకప్ 2026లో ఒక మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్.. 8 బతుల్లోనే 22 రన్స్ చేశాడు. మరోసారి దూకుడు ఇన్నింగ్స్ ఆడుతాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు భారత జట్టుకు కూడా కావాల్సింది అదే. మరోవైపు ఆడిన మ్యాచులలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. అభిషేక్ స్థానంలో సంజూ జట్టులోకి వస్తే.. జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘సమయం ఆసన్నమైంది సంజూ’, ‘ఇక టీమిండియాకు నువ్వే దిక్కు సంజూ’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా సరైన ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!