Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shai Hope About SS Bats: రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 102 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హోప్ చెలరేగడంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 లక్షాన్ని సునాయాసంగా ఛేదించి.. సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దగ్గర ఉన్న ఎస్ఎస్ బ్యాట్లన్నీ చాలా బాగుంటాయని, అందుకే బంతి బౌండరీలు దాటుతోందని సరదాగా చెప్పాడు. బౌండరీలు దాటించే విషయంలో మీపై మీకు నమ్మకం ఉందా? అనే ప్రశ్నకు హోప్ ఈ సమాధానం ఇచ్చాడు.
మీరు బంతిని పదేపదే బౌండరీలు దాటిస్తున్నారు, మీపై మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించగా.. ‘నా దగ్గర ఉన్న ఎస్ఎస్ బ్యాట్లన్నీ చాలా బాగుంటాయని చెప్పాలి. ఇక్కడ బంతి బాగా వేగంగా బౌండరీకి వెళుతోంది. బౌండరీలు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ మనపై మనకు నమ్మకం ఉండాలి. మనకు అనుకూలమైన బంతి వచ్చినప్పుడు బౌండరీ సాధించడానికి సరైన షాట్‌ను ఎంచుకోవాలి. ఈ రోజు నాకు అది బాగా కలిసొచ్చింది. గతంలో చెప్పినట్లుగ నాకు కూడా కొంత అదృష్టం కలిసి రావాలి. ఈ రోజు అదృష్టం నావైపు ఉంది. అందుకే ఈ సెంచరీ బాదాను’ అని షై హోప్ సరదాగా చెప్పుకొచ్చాడు.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
మీ కెరీర్లో ఇదే అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన అని భావిస్తున్నారా? అని అడగ్గా.. ‘దీనికి సమాధానం చెప్పడం కొంచెం కష్టం. పరుగులు చేస్తున్నప్పుడు సహజంగానే సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం నా ఫామ్ బాగుందని చెప్పవచ్చు. నేను ఎలా సిద్ధమవుతున్నాను, మానసికంగా తాజాగా, సిద్ధంగా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను అనే అంశాలు నా ప్రదర్శనకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయని భావిస్తున్నాను. ఈ ఫామ్ సాధ్యమైనంత ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. నా ప్రదర్శన బాగున్నప్పుడు మరీ అతిగా ఆనందపడకుండా ప్రయత్నిస్తాను. అలాగే నిరాశకు కూడా లోనుకాకుండా సాధ్యమైనంత ప్రశాంతంగా, సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని విండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
భాగస్వామ్యంలో ఒక బ్యాటర్ దూకుడుగా ఆడుతున్నప్పుడు మరో బ్యాటర్ అనవసరమైన రిస్కులు తీసుకోకుండా సహకరించడం ముఖ్యమని హోప్ అభిప్రాయపడ్డాడు. భాగస్వామ్యాల విషయంలో వెస్టిండీస్ మరింత మెరుగుపడాల్సి ఉందని, అయితే ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆడగలిగామని వివరించాడు. రన్‌రేట్‌ను కొనసాగిస్తూ లక్ష్యానికి చేరువ కావడంపైనే తాను దృష్టి పెట్టానని హోప్ చెప్పాడు. విండీస్ విజయంలో రూథర్‌ఫర్డ్ (84; 37 బంతుల్లో 7×4, 7×6) కూడా కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!