IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India WTC 2027 Final Hopes: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ప్రస్తుతం ఆధిపత్యంలో ఉంది. అయితే చివరి రోజు వర్షం పడే అవకాశాలు మెండుగా ఉండడంతో.. మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 229/6 స్కోరుతో నిలిచింది. దినూష దినుష (7), నువంత (3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంకకు 16 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. ఐదవ రోజు ఎంత త్వరగా లంక ఇన్నింగ్స్‌ను గిల్ సేన ముగిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకోకుంటే.. లంక ఓటమిని తప్పించుకునే అవకాశమే లేదు.
డ్రాగా ముగిసే అవకాశం:
శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 290 పరుగులకు ఆలౌట్ చేసి ఫాలోఆన్ ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో సోనల్ దినూష సెంచరీ చేయగా.. భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ టెస్టులో అరంగేట్రం చేసిన సారంశ్ జైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో పసిందు సూరియబండారా 92 పరుగులు, కమిందు మెండిస్ 55 పరుగులతో రాణించడంతో.. శ్రీలంక మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో భారత్ విజయానికి మరింత చేరువ కాలేకపోయింది. చివరి రోజైన గురువారం ఆట సజావుగా సాగకపోతే.. మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2027 ఫైనల్ ఆశలపై ప్రభావం పడనుంది.
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
పట్టికలో ఐదో స్థానం:
ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టీమిండియా పాయింట్స్ పర్సంటేజ్ (పీసీటీ) 53.33గా ఉంది. శ్రీలంకపై రెండో టెస్టులో గెలిస్తే.. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ భారీ ఓటమి పాలైన నేపథ్యంలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతుంది. అప్పుడు టీమిండియా పీసీటీ 51.52కు పడిపోతుంది. ఇప్పటికే ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన 10 టెస్టుల్లో నాలుగు ఓటములు చవిచూసిన భారత జట్టుకు.. ఇక మిగిలిన ప్రతి టెస్టూ కీలకంగా మారింది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లు:
శ్రీలంక సిరీస్ అనంతరం టీమిండియా నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో భారత్ సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అంటే శ్రీలంకతో రెండో టెస్టు తర్వాత భారత్‌కు ఇంకా ఏడు టెస్టులు మాత్రమే మిగిలి ఉంటాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్ అత్యంత నిలకడైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్ తర్వాత ఒక్కో టెస్టు ఫలితం కూడా కీలకం కానుంది. మిగిలిన ఎనిమిది టెస్టుల్లో ఏడు గెలిస్తే భారత్ చివరకు 68.52 పీసీటీ వరకు చేరుకునే అవకాశం ఉంది. అదే ఆరు విజయాలు, రెండు ఓటములతో ముగిస్తే.. పీసీటీ 62.96కి పడిపోతుంది.
పెనాల్టీ పాయింట్లు కోల్పోకుంటే:
అయితే ఈ గణాంకాలు పెనాల్టీ పాయింట్లు ఏవీ కోల్పోని పరిస్థితిలోనే సాధ్యమవుతాయి. అందువల్ల శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాకు ఇకపై పొరపాట్లకు పెద్దగా అవకాశం లేదని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై సాధించిన అనూహ్య విజయంతో డబ్ల్యూటీసీ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో రెండో టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు అత్యంత కీలకం. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. భారత్ నాలుగో స్థానానికి చేరే అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో వెనకపడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?