Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Comeback: భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ జట్టులోకి తిరిగి రావడంపై మరోసారి చర్చ మొదలైంది. కొలంబోలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను కలిసిన సూర్య.. సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జయసూర్య ఫిట్‌గా కనిపించడాన్ని గమనించిన సూర్యకుమార్.. ‘ఫిట్‌గా అవుతున్నారు.. మళ్లీ కమ్‌బ్యాక్‌కు ప్రయత్నిస్తున్నారా?’ అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీనికి జయసూర్య చిరునవ్వుతో స్పందించాడు. ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది.
అయితే ఈ సరదా సంభాషణకు మించి.. మరో న్యూస్ కూడా ఉంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలపై బీసీసీఐ వర్గాల నుంచి కూడా కీలక సమాచారం వెలువడింది. సూర్యకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, దేశవాళీ క్రికెట్లో వరుసగా పరుగులు సాధిస్తే అతడిని మళ్లీ ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహించి టైటిల్ అందించాడు. అయితే ఆ తర్వాత అతడి బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అంతేకాదు ఆటగాడిగా చోటు కోల్పోయాడు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా సూరీడుని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయాస్ నాయకత్వంలో భారత టీ20 జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఐర్లాండ్‌పై భారత్ 2-0తో సిరీస్ కోల్పోగా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో ఓటమి ఎదురైంది. జింబాంబ్వేపై సిరీస్ గెలవడం ఊరట కలిగింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ తిరిగి జట్టులోకి వస్తాడా? అనే చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
సూర్యకుమార్ తన కమ్‌బ్యాక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జూలైలో తన సోషల్ మీడియా ద్వారా ఒక రోజు మూడు గంటల పాటు సుమారు వెయ్యి బంతులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సూరీడు జాతీయ జట్టు ప్రణాళికల్లో భాగంగా లేకపోయినా.. దేశవాళీ క్రికెట్లో నిరంతరం రాణిస్తే తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో రాబోయే దేశవాళీ సీజన్ సూర్యకుమార్ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఒక్కసారి తన ఫామ్‌ను తిరిగి అందుకుంటే టీమిండియాలో కమ్‌బ్యాక్ చేస్తాడు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!