IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 1st ODI in Vizag: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఈ మ్యాచ్‌ను ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేదికను విశాఖపట్నానికి మార్చింది. తొలి వన్డే మ్యాచ్ డిసెంబరు 13న విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, స్టేడియంలో చేపట్టాల్సిన మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
రాజధాని ఢిల్లీలో సాధారణంగా వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో పాటు అరుణ్ జైట్లీ స్టేడియంలో అవుట్‌ఫీల్డ్‌ను తిరిగి సిద్ధం చేసే పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికను మార్చాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) బీసీసీఐని కోరింది. డీడీసీఏ అభ్యర్థనను పరిశీలించిన బీసీసీఐ.. వాతావరణం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం, స్టేడియంలో ప్రతిపాదిత పునరుద్ధరణ పనులను దృష్టిలో ఉంచుకుని వేదిక మార్పునకు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 13న జరగనున్న తొలి వన్డేను విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
- Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 13న విశాఖపట్నంలో తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం రెండో వన్డే డిసెంబరు 16న బెంగళూరులో, మూడో వన్డే డిసెంబరు 19న అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీ20 పోటీలు ప్రారంభమవుతాయి. డిసెంబరు 22న రాజ్‌కోట్‌లో తొలి టీ20, డిసెంబరు 24న కటక్‌లో రెండో టీ20, డిసెంబరు 27న పుణెలో మూడో టీ20 జరగనుంది.
భారత్, శ్రీలంక సిరీస్ పూర్తి షెడ్యూల్:
డిసెంబరు 13: తొలి వన్డే – విశాఖపట్నం
డిసెంబరు 16: రెండో వన్డే – బెంగళూరు
డిసెంబరు 19: మూడో వన్డే – అహ్మదాబాద్
డిసెంబరు 22: తొలి టీ20 – రాజ్‌కోట్
డిసెంబరు 24: రెండో టీ20 – కటక్
డిసెంబరు 27: మూడో టీ20 – పుణె
తాజావార్తలు
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!