IND vs ENG 3rd ODI: లార్డ్స్‌లో భారత్‌తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
- లార్డ్స్ వేదికగా జులై 19న మూడో వన్డే మ్యాచ్
- లార్డ్స్ వన్డే ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం
- ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Release Liam Dawson, Tom Banton: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ లియామ్ డాసన్, బ్యాటర్ టామ్ బాంటన్‌లను లార్డ్స్ వేదికగా జులై 19న జరగనున్న చివరి వన్డేకు ముందే జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరూ దేశవాళీ టీ20 బ్లాస్ట్ ఫైనల్లో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డాసన్, బాంటన్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేయలేదు.
మొదటి వన్డేలో లియామ్ డాసన్ అద్భుత హాఫ్ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు. జో రూట్‌తో కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూపర్ నాక్ ఆడినా రెండో వన్డేలో తుది జట్టులో మాత్రం అతడికి అవకాశం దక్కలేదు. దీంతో తన కౌంటీ జట్టు హాంప్‌షైర్ తరఫున ఎస్సెక్స్పై జరిగిన టీ20 బ్లాస్ట్ క్వార్టర్ ఫైనల్‌ను ఆడలేకపోయాడు. మరోవైపు టామ్ బాంటన్‌కు సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ విడుదల చేసి టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అనుమతించింది.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
- BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
- BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో తొలి సెమీఫైనల్లో సోమర్సెట్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్బ్యాక్స్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో హాంప్‌షైర్ హాక్స్, నాట్స్ అవుట్లాస్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల విజేతలు అదే రోజు సాయంత్రం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీపడతాయి. లార్డ్స్ వన్డేకు ముందు ఇంగ్లండ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. కార్డిఫ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో రాణించినా.. మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!