Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Father Sanjeev Comments: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడలేదు. తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్‌గా సంజు శాంసన్‌కే అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సంజు.. రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. దాంతో వైభవ్‌కు అవకాశం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే మూడో టీ20లో వైభవ్‌ను ఆడించే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రెండో టీ20 అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడో టీ20లో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం అని చెప్పాడు. సర్పంచ్ సాబ్ వ్యాఖ్యలు చూస్తే మూడో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడడం ఖాయం. అయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మల్లో ఒకరిపై వేటు పడనుంది. ఇద్దరిలో ఎవరు బెంచ్‌లో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్‌ను మీ కుమారుడు తుది జట్టులో లేకపోవడంపై ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఆయన సింపుల్‌గా స్పందించారు. ‘జట్టుకు అవసరం ఉన్నపుడు తప్పక ఆడతాడు. బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు’ అని సంజీవ్ చెప్పారు. వైభవ్ అవకాశం కోసం సిద్ధంగా ఉన్నాడని సంజీవ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్ 160 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయగా.. అభిషేక్ 19 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో భారత్ 14.5 ఓవర్లలోనే 163/3 స్కోరు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజు భారీ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావడంతో.. అతనికి, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మధ్య ఓపెనింగ్ స్థానంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడినట్టయింది. అయితే మూడో టీ20లో వైభవ్‌కు అవకాశం ఇస్తే.. సంజు, అభిషేక్‌లలో ఎవరిని పక్కన పెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!