ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం.. కింగ్ కోహ్లీని దాటేసిన డారిల్ మిచెల్!
- వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన
- వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ నం.1
- కింగ్ కోహ్లీని దాటేసిన డారిల్ మిచెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
వరుసగా రెండు సెంచరీలతో సిరీస్‌ను శాసించిన డారిల్ మిచెల్.. భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కు తొలి వన్డే సిరీస్ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 352 పరుగులు చేసిన మిచెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ అద్భుత ఫామ్‌నే తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడిని అగ్రస్థానానికి చేర్చింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. మిచెల్‌కు 845 రేటింగ్ పాయింట్లు ఉండగా, విరాట్ కోహ్లీకి 795 పాయింట్స్ ఉన్నాయి.
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్.. రేసులో ఇద్దరు బడా హీరోలు?
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా నిరాశపరచలేదు. మూడు మ్యాచ్‌ల్లో 240 పరుగులు చేసి రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మిచెల్ సూపర్ ఫామ్ కారణంగా కోహ్లీ కేవలం వారం రోజుల్లోనే తన నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. 2021 తర్వాత తొలిసారి అగ్రస్థానం సాధించిన కోహ్లీకి ఇది నిరాశపరిచే అంశమే. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల టాప్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఇబ్రాహీం జద్రాన్ (764), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (757), టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (723), పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ (722) ఉన్నారు. అలాగే హ్యారీ టెక్టర్, షై హోప్, చరిత్ అసలంక, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ట్రావిస్ హెడ్, క్వింటన్ డికాక్ లు బ్యాటర్లు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!