సమాజంలో ఆస్తుల కోసం హత్యలు చేసే సంస్కృతి పెరిగిపోతున్నాయి. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఆస్తులు కోసం, వివాహేతర సంబంధాల మోజుల్లో కట్టుకున్న వారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో దారణం జరిగింది. కుమార్తె పెళ్లికి ఇచ్చే కట్నం విషయంలో గొడవ జరిగిన ఒక ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటన గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బన్స్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిల్వార్ గ్రామంలో ఆస్తి దురాశతో, భార్య తన భర్త రమేష్ మౌర్య (45)ని కొడవలితో గొంతు కోసి హత్య చేసింది. నిందితురాలు భార్య రీటాను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Also Read:Bhatti Vikramarka: అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్‌కి రీటా రెండో భార్య. రమేష్ పంజాబ్‌లో ఉంటూ టైల్ ఇన్‌స్టాలర్‌గా పనిచేసేవాడు. మొదటి భార్య గిర్జ చనిపోయింది. 14 ఏళ్ల క్రితం రీటాను రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి మొదటి భార్య నుండి ఒక కుమారుడు సర్వేష్, ఇద్దరు కుమార్తెలు సుప్రియ, ప్రియాంజలి ఉన్నారు. ఇందులో సుప్రియ పెద్దది. ఇక, రెండవ భార్య రీటాకి సమీర్ అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె సుప్రియ వివాహం మే 2న జరగనుంది. కట్నం విషయంలో రమేష్‌తో రీటా గొడవ పడింది. ఫిబ్రవరి 9వ తేదీన రమేష్ పెళ్లికి పనుల కోసం ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
Also Read:Bollywood Actress Molested: బాలీవుడ్ నటికి వేధింపులు.. ఫైనాన్షియర్ ఏం చేశాడంటే..!
రీటా మలవిసర్జన సాకుతో బయటకు వెళ్లి ఇంట్లో ఉంచిన కొడవలి తెచ్చిందని చెబుతున్నారు. భర్త రమేష్‌ను పిలిచి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. తన వాటా మొత్తం కూడా ఖర్చయిందని ఆవేదన చేసింది. ఈ క్రమంలో భర్తపై కొడవలితో దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. రీటా వెంటనే తెచ్చుకున్న కొడవలితో రమేష్ మెడపై మూడుసార్లు కొట్టింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో ఒక్కసారిగా శబ్దాలతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి రమేష్ తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి కోడలిని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా అప్పగించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. పెద్ద కూతురు పెళ్లిపై రెండో భార్య చాలా కోపంగా ఉందని సౌత్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.