కమర్షియల్ సినిమాలకి, హీరో ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి, ఫైట్స్ కి, ఎలివేషన్స్ కి… ఇలా ఒక సినిమాకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ‘జాన్ విక్’. కుక్క పిల్ల కోసం జాన్ విక్ చేసిన విధ్వంసం సినీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ మూవీని ఇచ్చింది. పెన్సిల్, ఫోర్క్, స్వోర్డ్, గన్… వాట్ నాట్, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకోని శత్రువులని చంపడమే పనిగా ‘బాబా యాగా’ ఇప్పటికీ ఆడియన్స్ ని మెప్పిస్తునే ఉంది. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా బయటకి వచ్చి రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఒక్కసారి జాన్ విక్ సినిమాలని చూడడం మొదలుపెడితే ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రతి సినిమాని చూసేస్తారు. అంత ఇంపాక్ట్ ఇచ్చే జాన్ విక్ మూవీ రేంజులో బాలీవుడ్ లో ఒక సినిమా వస్తున్నట్లు ఉంది. ఇటివలే లాంచ్ అయిన జియో స్టూడియోస్ నుంచి రానున్న ‘బ్లడీ డాడీ’ సినిమా టీజర్ జాన్ విక్ ని గుర్తు చేసే రేంజులో ఉంది. ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన షాహిద్ కపూర్ ‘బ్లడీ డాడీ’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ తో ‘టైగర్ జిందా హై’ లాంటి హై వోల్టేజ్ స్పై యాక్షన్ సినిమా చేసిన ‘అలీ అబ్బాస్ జాఫర్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గూండే, సుల్తాన్, టైగర్ జిందా హై సినిమాలు చూస్తే అలీ అబ్బాస్ జాఫర్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా చూపిస్తాడో అర్ధమవుతుంది. అలాంటి డైరెక్టర్, షాహిద్ ని కూడా కంప్లీట్ కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడనే విషయం బ్లడీ డాడీ పోస్టర్ తోనే అర్ధమయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ బయటకి వచ్చింది. నిమిషమున్నర ఉన్న ఈ టీజర్ చూస్తే రక్తం ఏరులై పారడం కనిపిస్తోంది. జాన్ విక్ లా షాహిద్ కపూర్ కూడా చేతికి ఏది దొరికితే అది తీసుకోని శత్రువులని చంపుతున్నాడు. ఇంత ఇంటెన్స్ యాక్షన్ లో కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసినట్లు ఉన్నారు. టీజర్ లో ఈ ఎమోషన్ ని బాగానే రిజిస్టర్ చేశారు. ఓవరాల్ గా మేకింగ్ స్టైల్, స్టంట్స్, కలర్ ప్యాలెట్, ఇంటెన్సిటీ చూస్తుంటే టై అండ్ లాంగ్ హెయిర్ లేని జాన్ విక్ కథని హిందీలో చూస్తున్నట్లు ఉంది. మరి టీజర్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమా మొత్తం ఉంటే ‘బ్లడీ డాడీ’ ఇండియన్ సినిమాకి ‘జాన్ విక్’ అవ్వడం గ్యారెంటీ.
Get ready for a BLOODY good time at the movies. #BloodyDaddy releasing on June 9, 2023@aliabbaszafar @iHimanshuMehra #JyotiDeshpande @SunirKheterpal @gauravbose_TVW @jiostudios @JioCinema @AAZFILMZ @teamoffside #TheVermillionWorld @DianaPenty #SanjayKapoor @RonitBoseRoy
(1/2) pic.twitter.com/GBEDbWbIAq
— Shahid Kapoor (@shahidkapoor) April 13, 2023