WTC 2023 Final: భారత్ ఫైనల్‌కు చేరాలంటే.. అది తప్పకుండా జరిగి తీరాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Chances For Team India To Reach World Test Championship Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో.. భారత్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. కానీ.. భారత్ పరిస్థితే ఇంకా అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో భారత్ 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. కానీ, ఫైనల్స్‌లో అర్హత కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే.. పరిస్థితులు దాదాపు భారత్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, కనీసం డ్రాగా ముగిసినా.. ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధిస్తుంది. కానీ, ఓడిపోతేనే ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత జట్టు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రత పై సస్పెన్స్.. పిటీషన్ పై విచారణ వాయిదా
Also Read
- Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
అదెలా అంటే..?
ఈ నెలలో మార్చి 9వ తేదీన శ్రీలంక, న్యూజీలాండ్ జట్టు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌ను వెనక్కు నెట్టేసి, శ్రీలంక ఫైనల్స్‌కి చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా, డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్స్ అవకాశం కోల్పోయినట్టే! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ లెక్కన.. శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తేనే, ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందన్నమాట! అయితే.. న్యూజీలాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది కాబట్టి, శ్రీలంకకు క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే! కాబట్టి.. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Lionell Messi: నీ కోసమే వెయిటింగ్.. మెస్సీకి బెదిరింపు లేఖ
ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచెస్‌లో భారత్ గెలుపొందగా, మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో.. 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఓవైపు నాలుగో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ నెగ్గాలని చూస్తుంటే, మరోవైపు నాలుగో టెస్టులోనూ సత్తా చాటి ఈ సిరీస్‌ని డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా చూస్తోంది. మరి, ఈ నాలుగో మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!