Harmanpreet Kaur: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. ‘ఆ నలుగురు’ వల్లే విజయం!
- భారత్ మహిళల జట్టు మరో అద్భుత విజయం
- నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో విజయం
- విజయం క్రెడిట్ ఇద్దరికీ ఇవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ మహిళల జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. దాంతో మెగా టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులభం కాదని తెలిపింది. స్మృతి మంధానా, షెఫాలీ వర్మ భాగస్వామ్యమే జట్టుకు బలమైన పునాది వేసిందని తెలిపింది. విజయం క్రెడిట్ ఇద్దరికీ ఇవ్వాల్సిందేనని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.
క్రెడిట్ ఆ ఇద్దరికీ ఇవ్వాల్సిందే:
‘ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులభం కాదు. అయినప్పటికీ స్మృతి మంధానా, షెఫాలీ వర్మ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వారి భాగస్వామ్యమే జట్టుకు భారీ స్కోరు అందించింది. ఆ ఇద్దరికీ పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. జట్టులోని యువ ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. బౌలింగ్ చేసే అవకాశమొస్తే ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆటగాళ్లే జట్టుకు బలం. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకునే ప్లేయర్ భవిష్యత్తులో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతారు’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.
Also Read
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
- Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
- Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
- India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
శ్రేయాంక గాయం గురించి స్పష్టత లేదు:
‘గాయపడిన శ్రేయాంక పాటిల్ పరిస్థితిపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. వైద్య బృందం గాయంను పరిశీలిస్తుంది. పూర్తి వివరాలు తర్వాత తెలుస్తాయి. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో జట్టు అనుకున్న లక్ష్యాలను సాధించింది. జట్టు ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో క్రాంతి గౌడ్ జట్టుకు కీలక సేవలు అందిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా సంపాదించిన అనుభవంను నందిని ప్రపంచకప్‌లో సద్వినియోగం చేసుకుంటోంది. పవర్‌ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలను అందించడం సంతోషంగా ఉంది. ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.
సెమీఫైనల్ దిశగా మరో అడుగు:
ఈ మ్యాచులో స్మృతి మంధాన (74; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (55; 38 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ జోడీ మొదటి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం శ్రీ చరణి 4, షెఫాలీ వర్మ 3, నందని శర్మ 2 వికెట్లు పడగొట్టారు. దాంతో నెదర్లాండ్స్‌పై భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ భారీ విజయంతో భారత్ మహిళల జట్టు గ్రూప్-ఏలో తన స్థానంను మరింత బలోపేతం చేసుకుని సెమీఫైనల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!