Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most matches as captain in Women’s T20Is: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడంతో హర్మన్‌ప్రీత్ ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది. పురుషులు, మహిళలు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఏ ప్లేయర్ 150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ చాలా ముందంజలో ఉంది. శ్రీలంక మహిళల కెప్టెన్ చామరి ఆటపట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ 100 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన హీథర్ నైట్, రువాండా కెప్టెన్ డయాన్ బిమన్యిమనా చెరో 96 మ్యాచ్‌లతో టాప్ 5లో ఉన్నారు. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లోనూ అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు హర్మన్‌ప్రీత్‌కు ఆమడ దూరంలో ఉన్నారు. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు నాయకత్వం వహించి.. పురుషుల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 72 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.
Also Read
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
- Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
- Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
150 మ్యాచ్‌ల కెప్టెన్సీ ఘనతపై హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. మ్యాచ్‌ల సంఖ్యల కంటే ఆటను ఆస్వాదించడం ముఖ్యమని పేర్కొంది. ‘ఇది గొప్ప, అరుదైన రికార్డు. కానీ మైదానంలో ఆటను ఆస్వాదిస్తూ కొనసాగడం ఎంతో ముఖ్యం. నేను ఎప్పుడూ అదే ప్రయత్నిస్తాను’ అని చెప్పింది. హర్మన్‌ప్రీత్ ఎన్నో సంవత్సరాలుగా భారత మహిళల టీ20 జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా.. నాయకురాలిగా కూడా జట్టులో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె అద్భుత కెప్టెన్సీ కారణంగానే భారత మహిళల టీ20 క్రికెట్లో ఎంతో అనుభవం, స్థిరత్వం ఏర్పడింది.
మహిళల టీ20లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు:
150* – హర్మన్‌ప్రీత్ కౌర్
121 – చమరి అటపట్టు
100 – మెగ్ లానింగ్
96 – హీథర్ నైట్
96 – డయాన్ బిమెనియిమాన
తాజావార్తలు
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!