ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బుధవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచిన రాజస్థాన్.. చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఆఖరి ఓవర్ లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవపరమవ్వగా.. సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ కు సంచలన విజయాన్ని అందించాడు. ధోని స్ట్రైక్ లో ఉన్నప్పటికీ సందీప్ శర్మ మాత్రం యార్కర్లతో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మెగా ఈవెంట్ లో అదరగొడుతున్న రాజస్థాన్ రాయల్స్ స్థార్ ఓపెనర్ జోస్ బట్లర్ పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
Read Also : Eggs In Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా? డాక్టర్ల హెచ్చరిక
బట్లర్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. కాగా బట్లర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.. ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన జోస్.. 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ ను ఏమని ప్రశంసించాలో కూడా నాకు తెలియడం లేదని భజ్జీ అన్నాడు. అతడు వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడు.. అతను క్రీజును తనకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటాడు.. జోస్ కు మంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది.. స్పి్న్నర్లను కూడా అతడు సమర్థవంతంగా ఎదుర్కొగలడు.. నా వరకు అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అతడే నెంబర్ వన్ బ్యాటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. కాగా ప్రపంచ టీ20 క్రికెట్ ను శాసిస్తున్న బాబర్ ఆజం, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిజ్వాన్ ల పేర్లను హర్భజన్ సింగ్ ప్రస్తావించకపోవడం ఇక్కడ గమనించవలసిని విషయం.
Read Also : Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కి పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కరే తోయిబాతో సంబంధాలు..