టీమిండియా వెటరన్ ఓపెనింగ్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ 2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 40 పరుగులతో కీలక ఇన్సింగ్ ఆడిన గబ్బర్.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఐపీఎల్ లో అదరగొడుతున్న ధావన్ పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధావన్ ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించారు. కాగా ధావన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నారు.
Also Read : Skin Cancer : చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా.. క్యాన్సర్ కావొచ్చు ?
2018 నుంచి టెస్టులకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరస్ ల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఆ మూడు సిరీస్ ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టి, యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు అవకాశం కల్పించారు. ధావన్ చాలా సిరీస్ లలో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించాడని భజ్జీ అన్నాడు. ఆ సిరీస్ లో సారథిగా విజయవంతమయ్యాడు.. అయితే ధావన్ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశామని హర్భజన్ సింగ్ అన్నారు. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి.. ధావన్ ఒక అద్భుతమైన ఆటగాడు అంటు కితాబు ఇచ్చాడు.
Also Read : Manish Sisodia: ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలి.. జైలు నుంచి మోడీకి సిసోడియా లేఖ
అతడు భారత జట్టకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అటువంటి ప్లేయర్ పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు అని హర్భజన్ సింగ్ అన్నారు. ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీచ కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు ధావన్ కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు. అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రాజస్తాన్ మ్యాచ్ లో 86 పరుగులతో కీలక ఇన్సింగ్స్ కూడా ఆడాడు. అటువంటి ధావన్ కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటీ సమస్య.. ఫిట్ నెస్ పరంగా గబ్బర్ కూడా కోహ్లీలా 100 శాతం ఫిట్ గా ఉన్నాడని పేర్కొన్నాడు.