Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuma Vihari Questions BCCI Selection: భారత జట్టు ఎంపిక విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు హనుమ విహారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మకు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అవకాశాలు ఇవ్వడంపై మండిపడ్డాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్‌కు మాత్రం ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ప్రశ్నించాడు. 2-3 మ్యాచ్‌లలో విఫమైన సంజును జట్టు నుంచి తీసేశారని.. అభిషేక్‌ను మాత్రం కొనసాగిస్తున్నారని మండిపడ్డాడు. అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా? అంటూ ఫైర్ అయ్యాడు.
హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘ప్రపంచ కప్‌కు ముందు సంజు శాంసన్ ఐదు మ్యాచ్‌ల్లో రాణించకపోవడంతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి అవకాశం వచ్చిన తర్వాత ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ప్రదర్శనను పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో ఒక అర్ధశతకం మినహా అభిషేక్ బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. 20 లేదా 30 పరుగుల ఇన్నింగ్స్ కూడా లేవు. చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే చేశాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లను కలుపుకుంటే చివరి 18 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు అర్ధ శతకాలే ఉన్నాయి’ అని వివరించాడు.
Also Read
- Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
- Vaibhav Sooryavanshi ధనాధన్ ఇన్నింగ్స్ చూడలేకపోయారా.. మ్యాచ్ హైలెట్స్ చూసేయండి ఇక్కడ.!
- Arshdeep Singh: మై పర్సన్.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన అర్ష్‌దీప్ సింగ్.. సమ్రీన్ కౌర్ ఎవరు?
- Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా అర్ధ శతకాలు సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరమయ్యాడు. సంజూను ఇన్కన్సిస్టెంట్ అంటారు. అది సరే కానీ ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సామర్థ్యం అతనికి ఉంది. అభిషేక్ శర్మ చుట్టూ భారీ హైప్ ఉంది. కానీ సంజు కూడా ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. ఇద్దరు ఆటగాళ్ల విషయంలో ఎందుకు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారు?’ అంటూ హనుమ విహారి బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నించాడు. విహారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
CAT 2026 Notification: IIMల్లో MBA చదవాలనుకునే వారికి అలర్ట్.. CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
-
Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!