ఓ క్రికెట్ మ్యాచ్ ఏకంగా గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో జరిగిందో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 1939లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ 10రోజుల పాటు జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతి సుదీర్ఘమైన మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ మార్చి 3 నుంచి 14 వరకు జరిగింది.
ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టులు పూర్తయ్యే సమయానికి సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఐదో టెస్టు అనివార్య కారణాల వల్ల సుదీర్ఘంగా సాగింది. దాదాపు 43 గంటల 16 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగింది. 8వ రోజు వర్షం కారణంగా అయితే ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం రాబట్టకుండానే నిస్సారమైన డ్రాగా ముగిసింది. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టును ఇంటికి తీసుకెళ్లే షిప్ ఆ సమయానికి బయలుదేరాల్సి ఉంది. అందుకే ఇంగ్లండ్ టీమ్ ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 1,981 పరుగులు చేశాయి.