Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Gt Vs Dc Ipl 2026 Last Ball Thriller Match Highlights

DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

Published Date :April 8, 2026 , 11:53 pm
By Gogikar Sai Krishna
  • గుజరాత్ vs ఢిల్లీ.. హై స్కోరింగ్ థ్రిల్లర్
  • వాషింగ్టన్ సుందర్, గిల్ మెరుపులతో భారీ స్కోర్
  • కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్… సెంచరీకి అడుగు దూరంలో ఆగింది
  • చివరి బంతి డ్రామా… ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం
DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ మొదటి అర్థ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించగా, గిల్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. 211 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే నిస్సాంకా వేగంగా పరుగులు రాబట్టి ఆశలు రేకెత్తించాడు.

అయితే ఈ మ్యాచ్‌కు అసలైన ఆకర్షణ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్, కేవలం 52 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. సెంచరీకి అతివలువలో ఉన్న దశలో సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రాహుల్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ వైపు మొగ్గు చూపింది. కానీ, డేవిడ్ మిల్లర్ క్రీజులోకి రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మిల్లర్ ఆఖరి ఓవర్లలో సిరాజ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. సిక్సర్లు , ఫోర్ల వర్షం కురిపించడంతో ఢిల్లీ విజయం ఖాయమని అందరూ భావించారు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలవడానికి 13 పరుగులు అవసరమవ్వగా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు.

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికే విప్రజ్ నిగమ్ ఫోర్ కొట్టడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే రెండో బంతికి నిగమ్ అవుట్ కావడంతో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైకింగ్‌ను మిల్లర్‌కు ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ స్టేడియం వెలుపలకు పంపడంతో ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ ఐదో బంతిని మిల్లర్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో మిల్లర్ షాట్‌ను మిస్ చేయగా, సింగిల్ తీసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. అంపైర్లు ఆ బంతిని ఎత్తు కారణంగా నో-బాల్‌గా పరిగణిస్తారేమోనని కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అది సరైన బంతి అని తేలడంతో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ , మిల్లర్ శ్రమ వృథా అయినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని పంచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • delhi capitals
  • Gujarat Titans
  • IPL 2026
  • KL Rahul

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions