ఇవాళ్టి నుంచి ఇంండియన్ ప్రీమియల్ లీగ్ 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే సిద్దమైంది. ఇక సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కేల మధ్య జరుగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

Also Read : 6G Technology: ఇక.. 6G దిశగా.. రెడీ అవుతున్న ఇండియా. 100 పేటెంట్లు భారతీయుల సొంతం
అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురువడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషల్ లను రద్దు చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే అంశం. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అని ఆందోళణ పడుతున్నారు.
Also Read : North Korea : ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..
అయితే ఉదయం నుంచి అహ్మదాబాద్ లో వర్షం పడలేదు.. పైగా ఎండ బాగానే కాస్తుంది. అయితే వర్షం పడే అవకాశాలు అసలు లేవని.. ఒకవేళ ఉన్నా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రానికి కల్లా పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా జరుగుతుంది.
Also Read : Jana Reddy: బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం
ఇక ప్రారంభ వేడుకలకు ఐపీఎల్ నిర్వహకులు ఘనంగా నిర్వహించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ ధోని ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి. బెన్ స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. మరోవైపు ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్ సీఎస్కేపై నెగ్గి తమ ఆధిపత్యం చూపించాలని అనుకుంటుంది. గత సీజన్ లో గుజరాత్ తో తలపడిన రెండు మ్యాచ్ ల్లోను సీఎస్కే ఓటమి పాలైంది.