BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Master Plan for 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు ముందుగానే అలవాటు పడేందుకు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేకంగా వన్డే సిరీస్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకే బీసీసీఐ.. క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు ప్రారంభించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. 2027 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాలోనే భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో నాలుగు నుంచి ఆరు వన్డేలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2027 తర్వాత భారత జట్టు పర్యటనలను బీసీసీఐ ఇంకా పూర్తిగా ఖరారు చేయలేదు. దీంతో ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అవసరమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచకప్ జరిగే దేశంలోనే ముందుగా ఆడటం ద్వారా ఆటగాళ్లకు అక్కడి పిచ్‌లు, వాతావరణం, పరిస్థితులపై మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. టోర్నీ సమయానికి ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్నెస్తో అందుబాటులో ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారత జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ ఇప్పటికే ఆటగాళ్ల కోసం ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫిట్నెస్ ప్రణాళికపై ఆటగాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కూడా బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల దృక్కోణాన్ని గిల్ ద్వారా తెలుసుకుని.. మేనేజ్మెంట్, బీసీసీఐ, సపోర్ట్ స్టాఫ్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇద్దరూ భారత జట్టు కీలక ఆటగాళ్లు కావడంతో.. ప్రపంచ కప్ సమయానికి వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా వర్క్‌లోడ్, ఫిట్నెస్ నిర్వహణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ముందస్తుగా వన్డే సిరీస్ ఆడటంతో పాటు ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టడం ద్వారా మెగా టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చూస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..