Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Gautam Gambhir Reacts To Virat Kohli Question After Indias T20 World Cup 2026 Victory

Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

Published Date :March 9, 2026 , 9:03 am
By Sampath Kumar
  • ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్
  • కోహ్లీ గురించి ప్రస్తావించగా గంభీర్ ఆగ్రహం
  • విరాట్ కోహ్లీని అస్సలు మిస్ అవ్వలేదు
Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gautam Gambhir Fires on Reporter After Ask Virat Kohli Question: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో సంజు శాంసన్‌ (89), అభిషేక్‌ శర్మ (52), ఇషాన్‌ కిషన్‌ (54), జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్‌ పటేల్‌ (3/27)లు కీలక పాత్ర పోషించారు. అయితే టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక రిపోర్టర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించగా.. కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘టీ20 ప్రపంచ కప్ 2026లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టు కుప్పకూలింది. ఛేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు లేకపోవడం మిస్ అయ్యారా?’ అని రిపోర్టర్ అడగ్గా.. ‘అస్సలు మిస్ అవ్వలేదు. ఒక్క శాతం కూడా మిస్ కాలేదు. ప్రస్థుత జట్టుపై, అందరు ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ టీమ్ బాగా ఆడుతోంది. బయట నుంచి ఎవరి అవసరం మాకు లేదు’ అని గంభీర్ సమాధానం ఇచ్చాడు.

‘జట్టు కుప్ప కూలిపోయే పరిస్థితుల్లో మ్యాచ్‌ను నిలబెట్టే ఆటగాడు అవసరమే కదా?’ అని గౌతమ్ గంభీర్‌ను రిపోర్టర్ మరో ప్రశ్న అడిగాడు. అప్పుడు గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘అవును.. మ్యాచ్‌ను నిలబెట్టే ఆటగాళ్లు అవసరమే. ప్రస్తుత జట్టులో కఠిన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన జట్టును నిందించలేం. మిగతా మ్యాచ్‌లలో మా ప్లేయర్స్ బాగా ఆడారు’ అని గౌతీ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించడం సరైంది కాదని గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. ‘ప్రతి విషయాన్ని విరాట్ కోహ్లీతోనే అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేం ప్రపంచకప్ గెలిచాం. ఈ జట్టులోని భారత ఆటగాళ్లు ఛాంపియన్స్. కాబట్టి ఈ విజయాన్ని సాధించిన ఆటగాళ్ల గురించే మాట్లాడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి చర్చ అవసరం లేదు’ అని గంభీర్ స్పష్టం చేశారు. గంభీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. గంభీర్, కోహ్లీ మధ్య పెద్దగా సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gambhir Reporter
  • Gautam Gambhir
  • Gautam Gambhir Virat Kohli
  • ind vs nz
  • India vs New Zealand

తాజావార్తలు

  • Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

  • Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

  • Gautam Gambhir: ఈ విక్టరీ క్రెడిట్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌దే.. గంభీర్ షాకింగ్ స్టేట్‌మెంట్!

  • Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!

  • Loksabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్

ట్రెండింగ్‌

  • Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర!

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions