Umesh Yadav: టీమిండియా క్రికెటర్‌కు షాక్.. రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. స్నేహితుడి చేతిలో ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమేష్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన తర్వాత తన వ్యవహారాలను చూసుకునేందుకు తన స్నేహితుడు శైలేష్ ఠాక్రే(37)ను పర్సనల్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకున్నాడు. శైలేష్‌తో తనకు ఎంతోకాలంగా స్నేహం ఉండటంతో ఉమేష్ ఇలా చేశాడు. అంతేకాకుండా ఉమేష్ తన స్నేహితుడికి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణ కూడా అప్పగించాడు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు.
Read Also: Team India: మైదానంలోకి దూసుకెళ్లాడు.. రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
- Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
- Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
- Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
కాగా ఉమేష్ యాదవ్ స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. తన స్నేహితుడు శైలేష్‌ది కోరాడి పట్టణం. ఈ నేపథ్యంలో నాగపూర్‌లోనే మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని ఠాక్రే.. ఉమేష్‌కు చెప్పాడు. దాంతో ఆ స్థలం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించిన ఉమేశ్ యాదవ్ రూ.44 లక్షలను ఠాక్రే ఖాతాలో వేశాడు. అయితే ఠాక్రే ఆ ప్లాట్‌ను తన పేరిట కొనుగోలు చేశాడు. తనను ఠాక్రే దారుణంగా మోసం చేశాడని గుర్తించిన ఉమేష్ యాదవ్… తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అందుకు ఠాక్రే నిరాకరించడంతో ఉమేష్ పోలీసులను ఆశ్రయించాడు. కోరాడి పట్టణ పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించి సెక్షన్ 406, సెక్షన్ 420 కింద ఠాక్రేపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇంకా శైలేష్‌ను అరెస్ట్ చేయలేదని సమాచారం.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్‌పింగ్‌కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!