Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
- 24.80 సెకన్లతో సిమ్రాన్‌కు స్వర్ణం
- 100 మీటర్ల రేసులో గేమ్స్ రికార్డు
- వ్యక్తిగత ఉత్తమ సమయంతో తేజిబెన్కు కాంస్యం
- ఒకే ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్నారు. పారా అథ్లెటిక్స్‌లో భారత్ మరోసారి జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేసింది. మహిళల 100 మీటర్ల టీ12 (T12) ఫైనల్ రేసులో భారత స్టార్ అథ్లెట్ సిమ్రాన్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన విజయం సాధించింది. ఈ ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసింది.
రికార్డు టైమింగ్‌తో గోల్డ్ మెడల్ సాధించిన సిమ్రాన్
మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్స్ లో పోటీపడిన సిమ్రాన్ కేవలం 24.80 సెకన్లలోనే గమ్యస్థానాన్ని చేరుకుని సరికొత్త గేమ్స్ రికార్డును (Games Record) సృష్టించింది. ఆమె వేగం, పట్టుదల ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే పోటీలో ఇరాన్ అథ్లెట్ హజార్ సఫర్జాదే 25.02 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత (Silver) పతకాన్ని దక్కించుకోగా.. భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి తేజిబెన్ దామోర్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆమె 25.23 సెకన్ల వ్యక్తిగత ఉత్తమ సమయంతో (Personal-best) కాంస్య (Bronze) పతారాన్ని ముద్దాడింది.
Also Read
- Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
- Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
- Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
ఒకే ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు
ఒకే ఈవెంట్లో దేశానికి రెండు పతకాలు (స్వర్ణం, కాంస్యం) దక్కడంతో క్రీడా వర్గాల్లో, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుదల ఉంటే వైకల్యాన్ని సైతం జయించి విజయాల శిఖరాలను అధిరోహించవచ్చని సిమ్రాన్, తేజిబెన్ దామోర్లు మరోసారి నిరూపించారు. పారా గేమ్స్‌లో పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతుండగా, విజేతలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!