Formula E World Championship To Start From February 11 In Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్‌కి వేదిక అయిన హైదరాబాద్.. ఇప్పుడు ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ రేసింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ రేసింగ్‌ని చూసేందుకు సాధారణ జనాలకు కూడా అనుమతి ఇస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ రేసింగ్ టికెట్లను విడుదల చేశారు. క్యాటగరీ వారీగా.. ఈ టికెట్ల ధర రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు కేటాయించారు.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చాలా స్పీడ్‌గా ఎదుగుతున్న గ్లోబల్ సిటీ అని కొనియాడారు. ఐటీ, ఇన్ఫ్రా, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్‌గా ఈ నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. 25 నగరాలను పక్కకు నెట్టి.. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ అవార్డ్ దక్కించుకుందని పేర్కొన్నారు. ఇవన్నీ హైదరాబాద్‌లో ఈ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిస్ రేస్ జరగడానికి కారణమయ్యాయని తెలిపారు. ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ రేస్ జరుగుతుందని, ఫిబ్రవరి 11న ఇది ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. మొత్తం 11 టీమ్స్, 22 మంది రేస్ డ్రైవర్స్ ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. 2.8 కిలోమీటర్స్ ట్రాక్‌లో ఈ రేస్ జరగనుందన్నారు. మొన్న జరిగింది ఫార్ములా-ఈ రేస్ కాదని, అది ఇండియన్ రేసింగ్ లీగ్ అని క్లారిటీ ఇచ్చారు.
Darsha Gupta: వీడియో పోస్ట్ చేసి మరీ.. గట్టి కౌంటర్ ఇచ్చింది
ఈ ఫార్ములా-ఈ రేస్ చూడ్డానికి వచ్చే ప్రేక్షకుల కోసం అన్ని సౌకర్యాలకు ఏర్పాటు చేస్తామని అరవింద్ కుమార్ హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలు సైతం ఈ రేసింగ్ చూసేందుకు వీలుగా, అందుబాటు ధరల్లోనే టికెట్స్ కేటాయించడం జరిగిందన్నారు. రూ. 1000 నుంచి టికెట్ ధరలు ఉన్నాయని, బుక్ మై షోలో ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి, లైవ్ ప్రసారం చేస్తామన్నారు. 25 వేల సిటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన జయదేవ్.. ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి