Darsha Gupta Gives Strong Counter To Trollers With Video Proof: రంగుల ప్రపంచమైన సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషిస్తారు. దర్శకనిర్మాతలు సైతం వారికి ఎక్కువభాగం అలాంటి పాత్రలే ఇస్తారు. నిజానికి.. కథానాయికలకు కూడా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలంటే చాలా ఇష్టం. హీరోలకు ధీటుగా ఇండస్ట్రీలో రాణించాలనే కసి ఉంటుంది. కానీ, ఆఫర్లు లేక గ్లామర్ పాత్రలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పుష్కరాలకోసారి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి కానీ, ఆ తర్వాత మళ్లీ పాత చింతకాయ పచ్చడే అన్నట్టు గ్లామర్ పాత్రలే వస్తాయి. ఇండస్ట్రీలో రాణించాలంటే, హీరోయిన్లకు ఇక తప్పదు. ఇందుకు దర్శా గుప్త కూడా మినహాయింపు కాదు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన ఈ బ్యూటీ.. నిత్యం హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారుని కవ్విస్తుంటుంది. గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది.
అయితే.. కొందరు ట్రోలర్స్ మాత్రం దర్శాగుప్తని టార్గెట్ చేసి, ఎప్పుడూ ఇలా గ్లామర్ ఒలకబోయడం తప్ప ఇంకేం చేయలేవా? అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అందాలను ఎరగా వేయడం కాదు.. ట్యాలెంట్ కూడా నిరూపించుకోవాలని ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ చూసిన దర్శాగుప్త.. మాటలతో కాకుండా చేతలతో కౌంటర్ ఇచ్చింది. తాను కేవలం అందాల్ని మాత్రమే ఒలకబోయడం లేదని, ఎంతో కష్టపడుతున్నానని పేర్కొంటూ.. అందుకు సాక్ష్యంగా ఒక వీడియో పోస్ట్ చేసింది. ‘ఓ మై ఘోస్ట్’ సినిమాలో తాను డూప్ లేకుండానే ఫైట్ సీన్లలో నటించానని ఆ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. అందులో రోప్స్ కట్టుకొని, తలక్రిందులుగా వాలడాన్ని మనం గమనించవచ్చు. గ్లామర్‌తోనే ఆఫర్లు వస్తున్నాయని తనపై ముద్ర వేసిన వారికి ఇదే సమాధానమని, ఆ వీడియో కింద దర్శాగుప్త పోస్ట్ చేసింది.