అందరూ ఇష్టపడే జ్యూస్‌లలో పైనాపిల్ జ్యూస్ ఒకటి. అయితే.. దీని వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
పైనాపిల్‌లోని బ్రోమెలైన్.. ఆకలిని అణిచివేసి ప్రేగు కదలికలను సున్నితంగా చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్నవారు.. పైనాపిల్ జ్యూస్ తాగితే, ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పైనాపిల్ జ్యూస్ తాగేవారు.. కాంతివంతంగా, అందంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
అయితే.. పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, దీని వల్ల తీవ్రమైన ఎసిడిటీ రావొచ్చు.
పైనాపిల్‌లో వుండే అధిక ఫైబర్.. అతిసారానికి కారణమవుతుంది.
అలెర్జీ ఉన్న వ్యక్తులు పైనాపిల్ జ్యూస్ తాగితే.. నోరు, బుగ్గల వాపు వస్తుంది.
పైనాపిల్ జ్యూస్ ఎక్కువగా తాగితే.. బద్ధకం, బలహీనత, తలనొప్పి, వికారం మొదలైనవి కనిపిస్తాయి.
కాబట్టి.. పరిమితంగా పైనాపిల్ జ్యూస్ తాగితే, ఎలాంటి సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.