Fans Fire On BCCI For Not Giving Chance To Rahul Tripathi Ruturaj Gaikwad: రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్లో వీళ్లిద్దరు ఎంత మంచి ప్రదర్శన కనబరిచారో అందరికీ తెలుసు! తమతమ జట్ల విజయాల్లో వీళ్లు కీలకంగా నిలిచారు. అలాంటి ప్లేయర్స్‌కి భారత జట్టులో చోటిస్తే బాగుంటుందని, వాళ్లు కచ్ఛితంగా అదరగొడతారని క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు. ఫ్యాన్స్ ఆశించినట్టుగానే జింబాబ్వే సిరీస్ కోసం భారత స్క్వాడ్‌లో ఆ ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. కానీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం మాత్రమే దొరకలేదు.
తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి, సిరీస్ కైవసం చేసుకుంది కాబట్టి.. మూడే వన్డేలో అయినా వారికి ఆడే ఛాన్స్ దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, వారికి నిరాశే మిగిలింది. మూడో వన్డేలోనూ వారిని ఆడనివ్వలేదు. ఓపెనింగ్ స్థానంలో కేఎల్ రాహుల్.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్ బరిలోకి దిగడంతో.. రుతురాజ్, త్రిపాఠిలకు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎలాగో భారత్ ఈ సిరీస్ గెలిచింది, కనీసం మూడో మ్యాచ్‌లో అయినా వారికి ఛాన్స్ ఇవ్వాల్సింది.. ఇది నిజంగా అన్యాయం’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘‘అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్ అయినపుడు, జట్టుకు ఎంపిక చేయడం ఎందుకు’’ అంటూ మరికొందరు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. విఫలమవుతున్నా.. ఇషాన్ కిషన్‌ను వరుసగా అవకాశాలు ఇస్తున్నారని, త్రిపాఠి విషయంలో ఇలా చేయడం ఏమాత్రం సరికాదని మండిపడుతున్నారు. కాగా.. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడాడు. అంతర్జాతీయ వన్డేలో తొలి సెంచరీ సాధించాడు.