ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరలో ఈరోజు భారత్-ఇంగ్లాండ్ మధ్య పింక్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంతకముందు జరిగిన రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ కూడా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ తో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్‌మాన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా
ఇంగ్లాండ్ జట్టు : డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (c), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (w), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్