Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో శ్రీలంకకు సిరీస్ సమం చేసే అవకాశం లేకపోయింది. అయితే సిరీస్‌లో ఓటమి ఎదురైనా.. భవిష్యత్ శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి పలు సానుకూల అంశాలు కనిపించాయని ఆ జట్టు కెప్టెన్ ధనంజయ డిసిల్వా అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్ జట్టును నిర్మించే దిశగా మంచి అడుగు పడిందని పేర్కొన్నాడు. సెలెక్టర్లు, కోచ్‌లు యువ ప్రతిభను గుర్తించి.. వారిని స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించారని చెప్పాడు. అయితే గాయాల కారణంగా జట్టుకు దూరమైన సీనియర్లు వస్తే.. తమకు పెద్ద తలనొప్పి మొదలవుతుందని డిసిల్వా చెప్పుకొచ్చాడు.
‘ఈ సిరీస్‌లో సానుకూలంశాలు చాలానే ఉన్నాయి. భవిష్యత్ శ్రీలంక క్రికెట్ కోసం ప్రతిభావంతమైన ఆటగాళ్లను గుర్తించడం ఎంతో ముఖ్యం. సెలెక్టర్లు, కోచ్ నాకు ఆ అవకాశం కల్పించారు. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని.. దేశం కోసం తమ బాధ్యతను స్వేచ్ఛగా నిర్వర్తించేలా అవకాశం ఇచ్చారు. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు తిరిగి వస్తే జట్టులో పోటీ ఎదురవుతుంది. ఇది మంచి తలనొప్పే అనే చెప్పాలి. జట్టులోని ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు తిరిగి వస్తారు. మళ్లీ జట్టులో చోటు కోసం పోటీ తీవ్రమవుతుంది. ఇది మంచి విషయమే’ అని ధనంజయ డిసిల్వా చెప్పాడు.
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
‘బహుశా గాలె టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నేను మరికొంతసేపు బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. అదే కీలకమైన సమయం. అక్కడే భారత్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. చివరకు సిరీస్‌ను గెలుచుకుంది. మేము సిరీస్ ఓడినందుకు బాధగా ఉంది. భవిష్యత్తులో మంచి ఆట ఆడుతాం’ అని డిసిల్వా తెలిపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఫాలోఆన్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 429/9 వద్ద డిక్లేర్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. సోనల్ దినూష వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడం, కొత్త ప్రతిభకు అవకాశాలు దక్కడం శ్రీలంకకు ఈ సిరీస్‌లో లభించిన ప్రధాన సానుకూల అంశాలుగా నిలిచాయి. భవిష్యత్‌లో సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య పోటీతో శ్రీలంక మరింత బలమైన జట్టుగా మారుతుందని డిసిల్వా ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!