ఐపీఎల్‌లో బుధవారం రాత్రి రాజస్థా్న్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ డకౌట్‌గా వెనుతిరిగినా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా నిలిచాడు.
డేవిడ్ వార్నర్‌కు జతగా మిచెల్ మార్ష్ రెచ్చిపోయి ఆడాడు. 62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో డీవై పాటిల్ స్టేడియాన్ని మార్ష్ హోరెత్తించాడు. చివర్లో మార్ష్ అవుటైనా కెప్టెన్ పంత్ (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో పాయింట్ల టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలు, ఆరు పరాజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.