David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!
- పీఎస్ఎల్ 2026 ప్రారంభానికి ముందే మరో ఆసక్తికర ఘటన
- కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వార్నర్ ఫైర్
- ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహించిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాను సిరియస్‌గా మాట్లాడుతుండగా.. ఇతర జట్ల కెప్టెన్లు సరదాగా ముచ్చటించుకోవడంతో వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని ‘స్కూల్ పిల్లలు’ అని వ్యాఖ్యానించాడు.
పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో డేవిడ్ వార్నర్‌తో పాటు మార్నస్ లబుషేన్, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ పాల్గొన్నారు. వార్నర్ తన జట్టు ప్రణాళికల గురించి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న కెప్టెన్లు సరదాగా చర్చించుకుంటూ ఉండటం అతనికి అసౌకర్యంగా అనిపించింది. దీంతో ‘ఇక్కడ ఏమవుతోంది?. క్షమించండి, ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్లు తమను తాము ప్రీమియం అంటున్నారు కానీ.. అసలు వాళ్లు పిల్లల్లానే ప్రవర్తిస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎలా కూర్చోవాలో, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ప్రవర్తనలో కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా సూచించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డు..
Also Read: Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్!
పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్ కరాచీ కింగ్స్‌కు నాయకత్వం వచించాడు. 11 మ్యాచ్‌లలో 368 పరుగులు చేశాడు. అతని నాయకత్వంలో జట్టు మూడో స్థానంలో నిలిచినా.. ఎలిమినేటర్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక పీఎస్ఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ.. క్రికెట్ కంటే ఎక్కువగా ఇతర కారణాలతో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా ఇంధన సంక్షోభం, యాజమాన్య నిర్ణయాలు, ప్లేయర్స్ తప్పుకోవడం, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జరిగిన ఘటనలు పీఎస్ఎల్ ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయి.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. దాంతో ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా (క్లోజ్డ్ డోర్స్) నిర్వహిస్తున్నారు. ఈసారి టోర్నమెంట్‌ను ఆరు వేదికల నుంచి కేవలం రెండు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. లాహోర్, కరాచీ నగరాల్లోనే అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభ వేడుకను కూడా రద్దు చేయడం మరో ముఖ్య పరిణామంగా మారింది. టోర్నీ మార్చి 26న ప్రారంభమై మే 3న ఫైనల్‌తో ముగియనుంది. మైదానంలో ఈ సీజన్ ఎలా సాగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
-
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!