భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్ లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ టోర్నీ నుండి కూడా భారత జట్టు ముందే నిష్క్రమించడంతో ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియాకు వస్తున్నారు. ఇక అలా దుబాయ్ నుండి ముంబై వచ్చిన హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువ చేసే రెండు వాచ్ లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేసారు. అయితే గత ఏడాది ఐపీఎల్ 2020 తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా అన్న కృనల్ పాండ్యా దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు బంగారం గుర్తించిన విషయం తెలిసిందే. అప్పుడు దానిని సీజ్ చేసి కృనల్ ను విడిచి పెట్టిన అధికారులు ఇప్పుడు హార్దిక్ ను అరెస్ట్ చేస్తారా.. లేదా వదిలేస్తారా అనేది చూడాలి.