IND Vs SL: టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. చెలరేగిన వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు .
గతంలో పాకిస్తాన్ గడ్డపై 2004లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఇలాంటి సీన్ జరిగింది. సెహ్వాగ్(309)తో పాక్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అదే మ్యాచ్‌లో సచిన్ కూడా 194 పరుగుల వద్ద ఉండగా ద్రవిడ్ డిక్లేర్డ్ అని ప్రకటించాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద వివాదమే రేగింది. కాగా రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలతో కలిసి ఆరు, ఏడో, 9వ వికెట్లకు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. గతంలో వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్ పేరిట ఈ ఫీట్ నమోదైంది.
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..