ఈ మధ్య లవర్స్ తెగ రెచ్చిపోతున్నారు..చుట్టూ జనం ఉన్నారన్న సంగతి కూడా మరచిపోయి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు..ఎవరుంటే మాకేం అంటూ బరితెగిస్తున్నారు.. చీకటి గదిలో ఏకాంతంగా చేసుకోవాల్సిన పనులను నలుగురిలో చేస్తున్నారు.. కొంచెం కూడా సిగ్గు లేకుండా చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇలాంటివి జరుగుతున్నాయా అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు..
తాజాగా ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే రెచ్చిపోయారు..బైకు పై వెళుతూనే రొమాన్స్ చేశారు.. అటుగా వెళుతున్న కొందరు వీళ్ళ రొమాన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.. మరీ ఇంత తెగించారేంట్రా అని తిట్టిపోస్తున్నారు..
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.. ఈ వీడియోలో బుల్లెట్ బైక్ ట్యాంక్‌పై తన ప్రేయసిని కూర్చోబెట్టుకున్న ప్రియుడు రోడ్డుపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నాడు. అమ్మాయి అతనికి ఎదురుగా కూర్చొని ముద్దులిస్తూ, హగ్ చేసుకుని రెచ్చిపోయింది. వీరి పిచ్చి పనులను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. వీడియోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది.. ఈ జంట సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారని వెంటనే వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు..