Chennai Super Kings Need To Score 215 To Win The Match Against GT in Finals: అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ 96 పరుగులతో వీరవిహారం చేయడం.. అర్థశతకంతో సాహా (39 బంతుల్లో 54) రాణించడం.. శుభ్మన్ గిల్ (39), హార్దిక్ పాండ్యా (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. చెన్నై సూపర్ కింగ్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, చెన్నైకి అది సాధ్యమవుతుందా? చెన్నై జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారు కానీ, గుజరాత్ బౌలర్లను అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మలుపు తిప్పగల సత్తా వారి సొంతం. మరి, చెన్నై బ్యాటర్లు వారిని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ జట్టు.. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు సాహా, గిల్ మొదటి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు. మూడో ఓవర్ నుంచి దుమ్ముదులిపేయడం మొదలుపెట్టారు. ఎడాపెడా షాట్లతో మైదానంలో బౌండరీల మోత మోగించేశారు. తొల వికెట్‌కి వీళ్లిద్దరు 67 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. 6.6 ఓవర్ల వద్ద ఎంఎస్ ధోని చేతిలో గిల్ స్టంప్ ఔట్ అయ్యాడు. అప్పుడొచ్చిన సాయి సుదర్శన్.. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. మరోవైపు.. సాహా తన దూకుడుని కొనసాగించాడు. ఇక సుదర్శన్ క్రీజులో కుదురుకున్నాక.. తన బ్యాట్‌కి పనిచెప్పడం ప్రారంభించాడు. ఇతడు జోష్‌లోకి వచ్చాక.. అర్థశతకం చేసుకున్న సాహా ఔట్ అయ్యాడు. సాహా పోయాక హార్దిక్ వచ్చాడు కానీ, అతనికి అంతగా ఆడే అవకాశం దక్కలేదు. సుదర్శనే వీరవిహారం చేశాడు. భారీ షాట్లతో చెలరేగి ఆడాడు. ఎంతటి క్లిష్టమైన బంతులు వేసినా, తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీలు బాదాడు.
MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు
చివరి ఓవర్‌లోని తొలి రెండు బంతుల్ని సిక్సులుగా మలిచిన అతగాడు.. తప్పకుండా సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ.. అప్పుడే పతిరానా తెలివి ప్రదర్శించాడు. ప్లో పేస్‌తో యార్కర్ బంతి వేశాడు. ఆ దెబ్బకు సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. బహుశా అతడు సెంచరీ చేయకపోవచ్చు కానీ, ఈ ఇన్నింగ్స్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ తర్వాతి బంతుల్ని పతిరానా కట్టుదిట్టంగా వేయడం, చివరి బంతికి రషీద్ ఔట్ అవ్వగా.. 214 పరుగులతో గుజరాత్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగించింది.