Chennai Super Kings Retained Ravindra Jadeja: గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ, రవీంద్ర జడెజా మధ్య విభేదాలు తలెత్తిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న నేపథ్యంలో జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే, అతని కెప్టెన్సీలో చెన్నై జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆ జట్టు గెలవలేదు. దీంతో.. జడేజా కెప్టెన్‌గా తప్పుకోవడం, ధోనీ మళ్లీ కెప్టెన్ బాధ్యతలు తీసుకోవడం, అదే సమయంలో జడేజా మిగతా మ్యాచ్‌లు ఆడని పక్షంలో.. జడేజా చెన్నై జట్టుకి గుడ్ బై చెప్పేసినట్టేనని అంతా ఫిక్స్ అయ్యారు. జడేజా కూడా అలాంటి సంకేతాలే ఇచ్చాడు.
కానీ.. చెన్న ఫ్రాంచైజీకి అనూహ్యంగా జడేజాని రిటైన్ చేసుకొని, అందరినీ షాక్‌కి గురి చేసింది. సరిగ్గా అదే సమయంలో.. ‘అంతా సెట్టయ్యింది, రీస్టార్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే.. ధోనీకి తలవంచి మరీ సలాం చేస్తున్నట్టు ఒక ఫోటోను ఆ ట్వీట్‌కు జత చేశాడు. చూస్తుంటే.. ధోనీ మధ్యవర్తిత్వం వహించి, జడేజాకి – చెన్నై ఫ్రాంచైజీకి మధ్య ఉన్న విభేదాలను తొలగించినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా.. జడ్డూ తిరిగి చెన్నై జట్టులోకి తిరిగి రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, అతడు ఈ జట్టులోనే అత్యంత కీలకమైన ఆటగాడు. బంతితో మాయ చేయడంతో పాటు బ్యాట్‌తో పరుగుల వర్షం కూడా కురిపిస్తాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే అతనికి తిరుగే లేదని చెప్పాలి. ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల్లో చెన్నై జట్టుని ఆదుకున్న ఘనత అతని సొంతం.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ
విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్
Everything is fine💛 #RESTART pic.twitter.com/KRrAHQJbaz
— Ravindrasinh jadeja (@imjadeja) November 15, 2022