WikiPedia: తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఖలిస్థాన్ దేశస్థుడిగా పేర్కొన్నందుకు వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది.
Read Also: Renu Desai: పవన్ రెండో భార్య రెండో పెళ్లి..?
పాకిస్థాన్‌తో ఆదివారం నాడు సూపర్-4లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ అర్ష్ దీప్ సింగ్‌ను తప్పుబడుతున్నారు. కీలక సమయంలో అతడు తేలికైన క్యాచ్‌ను విడిచిపెట్టడంతో కొందరు వ్యక్తులు అర్ష్ దీప్ సింగ్ ఖలిస్థానీ నేషనల్ క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడనే విధంగా సమాచారాన్ని ఎవరో ఎడిట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే వికీపీడియా నిర్వాహకులు ఈ సమాచారాన్ని సరిచేశారు. కానీ అప్పటికే అర్ష్ దీప్ సింగ్ ఖలిస్థాన్ దేశస్తుడనే వికీపీడియా సమాచారం వైరల్ కావడంతో అందరూ అతడికి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం #khalistani అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి.
Pakistan defeated India in a cricket match. So-called nationalists have gone after a Sikh cricketer, blaming him for the defeat and calling him Khalistani. #IndiaVsPakistan
— Ashok Swain (@ashoswai) September 4, 2022