అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు రష్యన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ క్రమంలో వీకిపీడియా యజమానికి 2 మిలియన్ల రూబుల్స్ ($24,464) జరిమానా విధించింది. ఉచిత, పబ్లిక్‌గా-ఎడిట్ చేయబడిన ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాను నిర్వహిస్తున్న లాభాపేక్షలేని సంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు న్యాయస్థానం ఈ జరిమానాను విధించింది.
వికీపీడియా వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన లేదా దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్‌సైట్ నిరాకరించడంతో పాకిస్తాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది.
WikiPedia: తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఖలిస్థాన్ దేశస్థుడిగా పేర్కొన్నందుకు వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది.…