Brad Hogg Shocking Comments On Virat Kohli And Pujara: టీ20, వన్డేల్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు.. అందరూ అదే అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే.. మూడు మ్యాచ్‌లు ముగిసినా, కోహ్లీ నుంచి ఒక్క ఆశాజనకమైన ఇన్నింగ్స్ రాలేదు. మూడో టెస్టుల్లోనూ అతడు ఘోరంగా విఫలమయ్యాడు. అతనితో పాటు ద్రవిడ్ తర్వాత ఇండియన్ వాల్‌గా గుర్తింపు పొందిన ఛటేశ్వర్ పుజారా సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లో అర్థశతకం సాధించాడే తప్ప.. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా తనదైన ముద్ర చూపించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
Asaduddin Owaisi: కేసీఆర్ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ
‘కొంతకాలం నుంచి పుజారా, విరాట్ కోహ్లీ టెస్టుల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు. కోహ్లీ వన్డే, టీ20ల్లో రాణించినా.. టెస్టుల్లో మాత్రం శతకం కోసం నిరీక్షణ తప్పట్లేదు. ఇక పుజారా గొప్ప ఫామ్‌లో లేడు. అతడు మునుపటిలా భారీ స్కోర్లు మలచలేకపోతున్నాడు. అయితే.. వీరిద్దరు మంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత విరాట్ పుంజుకుంటాడని నేను భావిస్తున్నా. ఒకవేళ విరాట్, పుజారా టెస్టుల్లో తిరిగి ఫామ్ అందుకోకపోతే.. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం రావొచ్చు. ఇటీవల దేశీయ క్రికెట్లో అదరగొట్టిన సర్ఫరాజ్‌ని జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నా. లేకపోతే.. సూర్యకుమార్ యాదవ్‌ని తీసుకునే ఛాన్స్ ఉంది. సర్ఫరాజ్ మంచి టాలెంట్ ఉంది కానీ, అతనికి ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్లో తన సత్తా చాటితే మాత్రం.. అతనికి తప్పకుండా జట్టులో స్థానం దక్కుతుంది’’ అంటూ హాట్ చెప్పుకొచ్చాడు.