Gambhir vs MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇక, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇప్పటికీ తన మాయాజాలంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు. ఇక, వచ్చే సీజన్‌లో బరిలోకి దిగుతాడా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో ధోనీకి బీసీసీఐ స్పెషల్‌గా ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రచారం అవుతుంది.
Read Also: SI Attack: యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై చేయి చేసుకున్న ఎస్ఐ..
అయితే, 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో ధోనీని బీసీసీఐ మెంటార్‌గా ఎంపిక చేసుకుంది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ధోనీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.. కానీ, ఈసారి మాత్రం అలా షార్ట్‌టర్మ్ కాకుండా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడికి చురుకైన వ్యూహాలను సుదీర్ఘంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అందుకే, మరోసారి మెంటార్‌గా ధోనీని నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి మాజీ కెప్టెన్ అందుకు ఒప్పుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాఫిక్.
Read Also: Headmaster Assaults: విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన హెడ్ మాస్టర్ అరెస్ట్!
ఇక, ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. మెంటార్‌గా ధోనీని తీసుకుంటే.. దానికి అతడు అంగీకరించకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజయం సాధించిన వన్డే, టీ20 ప్రపంచకప్ జట్లలో గౌతమ్ గంభీర్ కూడా సభ్యుడే.. అప్పుడు క్రెడిట్ మొత్తం కెప్టెన్ గా ధోనీకి ఇవ్వడం సరికాదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. భారత జట్టు కలసికట్టుగా ఆడితేనే గెలిచామని చెప్పే గంభీర్.. ధోనీ వంటి క్రికెటర్‌ను తనకంటే కాస్త పైపదవిలో ఉంచడానికి ఇష్టపడతాడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని సరదాగా గడిపిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.